
అలాగే సనాతన ధర్మం పాటించే వ్యక్తి చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు.తన భార్య అయిన క్రిస్టియన్ చేత ఎందుకు తిరుమలలో గుండు చేయించారంటూ అది అంత అవసరమా అనే విధంగా సిపిఐ నేత రామకృష్ణ ప్రశ్నించడం జరిగింది. వక్ఫ్ చట్టం పైన అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరు పైన సిపిఐ నేత విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవ తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడడంతో తిరుమలకు వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకొని మరి తలనీలాలు సమర్పించారు. అనంతరం 17 లక్షల రూపాయలు విరాళంగా కూడా అందించడం జరిగింది.
క్రిస్టియన్ అయినటువంటి అన్నా లేజీనోవ టిడిపి అధికారులకు కూడా డిక్లరేషన్ ఫారం అందించి మరి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇటీవలే అన్నా లేజీనోవ తలనినాలాలు ఇవ్వడం చేత కూడా చాలా రకాల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. సిపిఐ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు అటు జనసేన నేతలు కార్యకర్తలు కూడా కౌంటర్లు వేస్తూ ఉన్నప్పటికీ ట్రోల్ చేసేవారు మాత్రం ఆగడం లేదు. గతంలో కూడా సిపిఐ రామకృష్ణ పవన్ కళ్యాణ్ పైన సీఎం చంద్రబాబు పైన కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరొకసారి ఇలా చేయడంతో జనసేన కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.