
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు కూటమి పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ టాప్ లీడర్ ఒకరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ వైసీపీ టాప్ లీడర్ మాజీ ఎమ్మెల్యే కాగా ... కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విశేషం. ఇంతకు పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న ఆ నేత ఎవరో కాదు ?పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నంబూరు శంకరరావు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు.
ఇక ఇటీవల చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న మరి రాజశేఖర్ను టిడిపిలోకి తీసుకువచ్చారు లావు. ఈ క్రమంలోనే నంబూరు శంకరరావును కూడా టిడిపిలోకి తీసుకొచ్చేందుకు లావు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్నికలకు ముందు తనతో పాటు వైసీపీలో కలిసి పనిచేసిన గురజాల - వినుకొండ మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి - మక్కెన మల్లికార్జున్ రావుని సైతం టిడిపిలోకి తీసుకువచ్చి వారికి కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో లావు కీలక పాత్ర పోషించారు .ఇప్పుడు నంబూరు శంకరరావును కూడా టిడిపిలోకి తీసుకు వస్తున్నారు. అయితే నంబూరును పార్టీలోకి తీసుకురావడంతో పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు