అమెరికాకు 2017 వ సంవత్సరం డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యాడు. ఈయన 2021 వ సంవత్సరం వరకు అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగాడు. ఇక ఆ తర్వాత అమెరికాకు జో బైడెన్ అధ్యక్షుడి గా ఎన్నికయ్యాడు. ఈయన 2021 వ సంవత్సరం నుండి 2025 వ సంవత్సరం వరకు అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగాడు. ఇక కొంత కాలం క్రితమే అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మరో సారి ట్రంప్ ఎన్నిక అయ్యాడు. ఈయన అమెరికా అధ్యక్ష పదవి లోకి రాగానే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మొదట అక్కడి ప్రజలు ఈయనపై కాస్త పాజిటివ్ గానే రియాక్ట్ అయిన ఇప్పుడు మాత్రం అక్కడి ప్రజలు ఈయనపై తీవ్ర నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్నికలకు ముందు ట్రంప్ గ్రాఫ్ తో పోలిస్తే ప్రస్తుతం పెద్ద ఎత్తున పడిపోయినట్లు కూడా తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలకు ముందు ట్రంప్ కి అక్కడ అద్భుతమైన రేంజ్ లో అప్రూవల్ రేటింగ్ వచ్చింది. అలా ఎన్నికలకు ముందు అద్భుతమైన అప్రూవల్ రేటింగ్ ను తెచ్చుకొని అమెరికా అధ్యక్షుడు పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పనుల అమెరికాలో ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు ఈయన పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దానితో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ అమాంతం పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ట్రంప్ అధికారం లోకి వచ్చాక అనేక దేశాలపై పెద్ద మొత్తంలో టరీఫ్ లను కూడా విధిస్తూ వస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈయన భారత్ పై అత్యంత పెద్ద ఎత్తున టరీఫ్ లను విధిస్తూ వస్తున్నాడు. కొంత కాలంతో పోలిస్తే ట్రంప్ గ్రాఫ్ అమెరికాలో అత్యంత భారీగా పడిపోయింది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: