సోషల్ మీడియా అంటేనే స్టార్ సెలబ్రిటీలకు ఎప్పుడూ ఒక పరీక్షా వేదికగా మారిపోయింది. ఎవరు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఆ విషయం క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ, అలాగే మహేష్ బాబు పేర్లు  ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ మధ్య సంబంధాలు అంతగా బాగోలేవన్న చర్చలు సోషల్ మీడియాలో బాగా ఊపందుకున్నాయి. "ఇన్నాళ్లు బన్నీకి మెగా ఫ్యామిలీతో సఖ్యత లేదు" అని కొంతమంది ట్రోల్స్ తెగ చర్చించారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులు, అలాగే ఆయనపై పడిన నెగిటివ్ ప్రపగాండా కారణంగా సోషల్ మీడియాలో హీట్ ఎక్కువైంది.

అదే సమయంలో పుష్ప 2 సినిమా ప్రమోషన్ సమయంలో అల్లు అర్జున్ ఎక్కడా మెగా హీరో పేరు ప్రస్తావించకపోవడం, ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ బన్నీని పబ్లిక్‌గా అభినందించకపోవడం వంటివి పెద్ద చర్చగా మారాయి. దానికి తోడు, ఒక రాత్రి జైలులో గడిపాడని వచ్చిన వార్తలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ఫ్యాన్స్ మధ్య వాగ్వాదాలు మరింత పెరిగిపోయాయి.ఇప్పుడిప్పుడే ఆ ఇష్యూ కాస్త సద్దుమణుగుతుందనుకుంటున్న వేళ, మరో హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చెలరేగిపోయింది. ఈసారి అది అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు అంటూ కొంతమంది నెటిజన్లు బన్నీకి పోటీగా ఇప్పుడు మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నాడని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినీ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని టాక్. మరోవైపు అల్లు అర్జున్ కూడా అట్లీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో, స్పెషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది.ఈ రెండు సినిమాలు ఒకే సమయానికి రిలీజ్ అయ్యే అవకాశముండటంతో, టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద టఫ్ కాంపిటీషన్ నెలకొనబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో "అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు" అంటూ హ్యాష్‌టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మధ్య కౌంటర్స్, డిబేట్స్ గట్టిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు "మెగా ఫ్యామిలీ వర్సెస్ బన్నీ" అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగేవి. ఇప్పుడు ఆ స్థానం ఘట్టమనేని ఫ్యామిలీ తీసుకుందా? అంటూ నెటిజన్లు ఘాటుకగా రియాక్ట్ అవుతున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య ఈ  పోటీ ఎలా ముగుస్తుందో చూడాలి.  కానీ, ఇప్పటికి మాత్రం సోషల్ మీడియాలో ఇది ఒకే ఒక్క హాట్ టాపిక్‌గా మారిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: