గంభీర్ నేత్రుత్వంలో కలకత్తా ఈసారి మంచి దూకుడు ఆటతీరుని ప్రదర్శిస్తుంది. కెప్టెన్ గా గౌతం గంభీర్ ఏ మ్యాచ్ కూడా విఫలమవకుండా మ్యాచ్ విన్నర్ గా నిలుస్తున్నాడు. ఇక ఈరోజు ఢిల్లితో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఢిల్లికి బ్యాటింగ్ ఇచ్చారు కలకత్తా ఆటగాళ్లు. ఢిల్లి ఓపెనర్ సామ్స్ సన్ 60 పరుగులతో మంచి స్టార్ట్ ఇచ్చినా శ్రీయాస్ అయర్ 47 తప్ప మిగిలిన వారంతా తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. ఫైనల్ గా 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేశారు.  


ఇక నిర్ణీత ఓవర్లలో 161 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కలకత్తా జట్టు ఓపెనర్ నరైన్ 4 పరుగులకే అవుట్ అవగా రాబిన్ ఊతప్పా 59 పరుగులు చేశారు. కెప్టెన్ గంభీర్ 71 అజేయంగా మ్యాచ్ విన్ అయ్యేలా చేశాడు. 16.2 ఓవర్లకే కలకత్తా 161 పరుగులు చేసింది. ఆడిన 9 మ్యాచుల్లో 7 మ్యాచులను గెలుచుకుని ప్లే ఆఫ్ లో స్థానం సంపాదించింది కలకత్తా. 



మరింత సమాచారం తెలుసుకోండి: