బంగ్లాదేశ్ తో జరిగే డే నైట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత్ వెస్టిండిస్ తో టీ ట్వంటీ సిరీస్ తో పాటు వన్డే మ్యాచులు కూడా ఆడనుంది. ఈ సిరీస్ కి ఆతిథ్యమివ్వనున్న భారత్ వెస్టిండీస్ మూడు టీ ట్వంటీలు ఆడనుంది. అయితే ఈ మ్యాచులకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది ఇప్పటికే వచ్చేసింది. అయితే ఈ సిరీస్ కి రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్ లకి విశ్రాంతి ఇస్తారని భావించారు. కానీ ఈ ఇద్దరినీ వెస్టిండీస్ తో ఆడే సిరీస్ కి సెలెక్ట్ చేసింది. 

 

 

వీరితో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా ఈ సిరీస్ కి ఎంపికయ్యాడు.  అయితే ఒక ఇద్దరికీ మాత్రం నిరాశే మిగిలింది.అవకాశం వస్తే నిరూపించుకుందామనుకుంటున్న ఆ ఇద్దరినీ దురదృష్టం వెంటాడింది. ఆ దురదృష్టవంతులెవరో ఒకసారి చూస్తే, మొదటగా సంజూ సాంసన్.  వికెట్ కీపర్ అయిన సంజూ సాంసన్ అవకాశం కోసం ఎన్నీ రోజులుగా చూస్తున్నప్పటికీ ఆడే ఛాన్స్ మాత్రం రావట్లేదు. 

 

 

ప్రస్తుతం కీపర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ సరిగ్గ ఆడకపోయినప్పటికీ అతనికి అవకాశాల మీద అవకాశాలిస్తున్నారు. పంత్ స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకోవాలని ఒత్తిడి వస్తున్నా ఏవేవో చెప్పి అతన్ని పక్కన పెడుతున్నారు. పంత్ కి అన్ని అవకాశాలు ఇచ్చినవారు సంజూ సాంసన్ ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నగా మిగిలింది. కనీసం ఒక గేమ్ ఆడిస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. అయినా కూడా వెస్టిండీస్ తో జరిగే మ్యాచుల్లో కూడా అతన్ని దురదృష్టం వెంటాడింది.

 

 

రెండో వ్యక్తి శార్దుల్ ఠాకూర్. ఆట సంజూ శాంసన్ లాగే ఈ ఆటగాడికి కూడా ఒక్క అవకాశం రాలేదు. వీరిద్దరి కంటే తక్కువగా ఆడే వారిని తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఇద్దరికీ అవకాశం ఎప్పుడు వస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: