ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఐ‌పి‌ఎల్ 14 వ సీజన్ కు సంబంధించి చెన్నై వేదికగా నేడు వేలం జరగనుంది. వేలానికి వెయ్యిమందికి పైగా ఆటగాళ్లు ఆసక్తి చూపగా... వడపోత అనంతరం చివరకు 292 మంది వేలంలోకి వచ్చారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లయితే... 125 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మరో ముగ్గురు అసోసియేట్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి ఈ సీజన్ కు సంబంధించి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలుండగా... ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి.

పంజాబ్ జట్టులో 9 ఖాళీలు ఉండగా ఈ జట్టు ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా 53.20 కోట్లు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందుకోసం రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ తమ వద్ద మిగిలిన రూ.15.35 కోట్లతో ఏడుగురిని, ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.13.40 కోట్లతో ఎనిమిది మందిని, రూ.10.75 కోట్లతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 8 మందిని కొనుగోలు చేయనున్నాయి.

 ఈ సారి వేలంలో ఆస్ట్రేలియా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ ఈసారి వేలంలో హాట్ ఫేవరెట్ గా నిలవనున్నారు వీరిని కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడుతున్నాయి. అయితే బెంగుళూరు చూపు మాక్స్ వైపు, చెన్నై చూపు స్మిత్ వైపు ఉందని తెలుస్తుంది. ఇరు ఫ్రాంచైజీలు కూడా వీరిద్దరి కోసం కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది.. వీరితో పాటు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ, ఇతని సహచరుడు, నంబర్‌వన్‌ టి20 బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌లు కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలికే అవకాశం ఉంది. అయితే ఈ సారి అందరి చూపు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పై ఉంది. ఈ ఏడాది వేలానికి అర్జున్ కూడా రానున్నాడు. రూ. 20 లక్షల కనీస ధర కేటగిరీలో ఉన్న అర్జున్‌ ఎంత పలుకుతాడనేది ఆసక్తికరం. . 

మరింత సమాచారం తెలుసుకోండి: