ఇంటర్నెట్ డెస్క్: ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యంత దారుణంగా ఆడుతున్న జట్టేది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు కేకేఆర్. నిజానికి సన్ రైజర్స్ జట్టు ఇప్పక్టికీ ఒక్క విజయం కూడా సాధించకపోయినా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌తో పోల్చితే మెరుగ్గానే పోరాడుతోంది. ఎందుకో తెలీదు కానీ సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో కూడా ఓడిపోతూ కేకేఆర్ దారుణ ప్రదర్శన చేస్తోంది.

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై  విజయం తప్ప మిగతా మ్యాచ్ లలో కేకేఆర్ ఆటతీరు చూస్తే.. అసలు ఇది కేకేఆర్ జట్టేనా అనే అనుమానం రాక మానదు. ఇలాంటి తరుణంలో కేకేఆర్ జట్టు బుధవారం చెన్నై జట్టుతో తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టు నుంచి ఓ గుడ్ న్యూస్ బయటికొచ్చింది. అదేంటంటే.. కేకేఆర్ జట్టులోకి ఆ జట్టు స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్ బృందం మెక్‌కల్లమ్ తెలిపాడు.

చెన్నైలో మ్యాచ్‌లు ముగించుకున్న కోల్‌కతా జట్టు.. మరో వేదికైన ముంబై వెళ్లనుంది. ఈ క్రమంలోనే తమ తదుపరి మ్యాచ్‌ల కోసం చేస్తున్న ప్రణాళిక గురించి, జట్టు కూర్పు, మార్పుల గురించి మెక్‌కల్లమ్ వివరించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బుధవారం జరిగనున్న మ్యాచ్‌ కోసం ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ను తుది జట్టులోకి తీసుకోన్నట్లు వెల్లడించాడు.

‘మా మొదటి మ్యాచ్‌కు ముందు సునీల్‌ నరైన్‌ గాయంతో 100 శాతం ఫిట్‌గా లేడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు అతడు అందుబాటులో ఉన్నాడు. ఐతే తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించిన షకీబ్‌ అల్‌ హసన్‌ను కొనసాగించాం. తర్వాతి మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు మార్పులు చేయాలని అనుకుంటున్నాం. టోర్నీలో మాకు మంచి అవకాశం ఉందని చూపించాం. మూడు మ్యాచ్‌ల్లో మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఐతే మేం ఊహించని ఫలితాలు రాలేదు. ముంబైలో కొంచెం భిన్నమైన వికెట్ కావడంతో కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని’ వెల్లడించాడు.

నరైన్‌ ఫామ్‌లో ఉంటే బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టగలగడం అతడి స్పెషాలిటీ. మరి నరైన్ రాకతోనైనా కేకేఆర్ రాత మారుతుందేమో చూడాలి. మరి ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచులో ఒక్కటి మాత్రమే గెలిచి ఒత్తిడిలో ఉన్న కేకేఆర్ రాత నరైన్ రాకతో అయినా మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: