ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మొదట వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆగస్టు నాలుగో తేదీ నుంచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండియా.  అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్లో టీమిండియా ఓపెనింగ్ జోడి ఎవరు అన్నదానిపై గత కొంత కాలం నుంచి సందిగ్దత నెలకొంది.  జట్టు ఓపెనర్ గా ఎంపికైన శుభమన్ గిల్ గాయం బారిన పడడంతో అతని స్థానంలో ఎవరిని ఎన్నుకో పోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.



 అయితే మొన్నటివరకు ఇక శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా ని  ఇంగ్లాండ్ పంపించాలని  అతని చేతి ఓపెనింగ్ చేయిస్తాము అంటు టీమిండియా మేనేజ్మెంట్  తెలిపింది. కానీ అటు బీసీసీఐ  మాత్రం దీనికి ఒప్పుకోలేదు. జట్టులో కె.ఎల్.రాహుల్ మయాంక్ అగర్వాల్ లాంటి ఇద్దరు ఓపెనర్లు ఉన్నప్పటికీ పృద్వి షా ఎందుకు అంటూ ప్రశ్నించింది. అంతేకాదు పృథ్వీ షా ను  ఇంగ్లాండ్ కి పంపము అంటూ స్పష్టం చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా టెస్టు జోడి ఎవరు కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ కె.ఎల్.రాహుల్ ఇద్దరికీ కూడా ఇంగ్లండ్ గడ్డపై అనుభవం ఉంది.



 ఈ క్రమంలోనే ఇక మయాంక్ అగర్వాల్ ను ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా రోహిత్ కు జోడిగా ఓపెనర్గా ఆడించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి టెస్టులలో మయాంక్ అగర్వాల్ అంచనాలను అందుకోలేక పోతున్నాడు. కానీ రోహిత్ మయాంక్ ల జోడి 2019 భారత జట్టుకు టెస్టుల్లో మెరుగైన భాగస్వామ్యాన్ని అందించారు. ఇలా ఇంగ్లండ్ గడ్డపై కొత్త ప్రయోగాలు చేయడం కంటే ఇక పాత జోడి ని రిపీట్ చేయడమే బెటర్ అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందట.  ఈ క్రమంలోనే ఇక మయాంక్ అగర్వాల్ ను రోహిత్ శర్మ తో పాటు ఓపెనింగ్ జోడి గా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: