సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. క్రికెటర్లకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలో కెక్కింది అంటే అందరినీ ఆకర్షిస్తూ క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.  అదే ఒక స్టార్ క్రికెటర్ పెళ్లి గురించిన విషయం అయితే ఏకంగా సోషల్ మీడియాను ఊపేస్తుంది. కాగా గత కొంతకాలం నుంచి ఇలా సోషల్ మీడియాను ఊపేస్తున్న అంశం పాకిస్థాన్ యువ సంచలనం  షాహిన్  అఫ్రిది పెళ్లి గురించి. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయినా షాహిద్ అఫ్రిది కూతురిని షాహీన్ అఫ్రిది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొంత కాలం నుంచి వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి.



 ఇక ఇలాంటి వార్తలు అభిమానులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయ్ . సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇక ఇలా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై షాహీన్ అఫ్రిది క్లారిటీ ఇచ్చాడు. కెరియర్ లో ఇంకా చాలా ఎదగాల్సి ఉందని పెళ్లికి ఇప్పుడు తొందర ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. నా కెరీర్లో  ప్రస్తుతం ఎంతో కీలక సమయమని.. అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ రెగ్యులర్ గా బౌలర్ గా మారుతున్న సమయంలో.  ఎలా ముందుకు వెళ్లాలి అన్నది మాత్రమే ఆలోచిస్తున్నాను తప్ప పెళ్లి గురించి ఆలోచించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ లో తాను సాధిస్తున్న రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను అంటూ ఈ యువ బౌలర్  చెప్పుకొచ్చాడు.



 జట్టు తరఫున బాగా ఆడామా.. ఇక కీలక సమయంలో వికెట్లు పడగొట్టామా అన్న విషయాన్ని తాను పట్టించుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. అనుకుంటున్నట్లుగానే నా కెరియర్  తీర్చిదిద్దుకుంటున్న.. బౌలింగ్ లో  మంచి ఫాం కనబరిస్తే రికార్డులు వాటంతట అవే వస్తాయి. ఇక నాకు తెలిసినంతవరకు శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకుని జట్టుకు దీర్ఘకాలంపాటు సేవలు అందించాలన్నదే లక్ష్యం  అంటూ షాహీన్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.  దీంతో ఎన్నో రోజుల నుంచి అతని పెళ్లి పై వస్తున్న వార్తలకు  చెక్ పడినట్లు అయింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి అద్భుతంగా రాణిస్తూన్న షాహీన్ అఫ్రిది జట్టులో కీలక బౌలర్ గా మరి పోయాడు. అన్ని ఫార్మాట్లలో కూడా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: