ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ సాధించిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. అయితే 2019, 2020 లో వరుసగా రెండు సార్లు టైటిల్ అందుకున్న ముంబై ఇండియన్స్ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు పదకొండు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ అందులో ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించగా ఆరు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. అయితే ఈ సమయంలోనే ముంబై జట్టుకు షాక్ తగిలింది.

ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్... క్రికెట్ దిగ్గజం కుమారుడు అయిన అర్జున్ టెండూల్కర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్ ల నుంచి తప్పుకున్నాడు. అయితే సీజన్ కోసం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను కనీస ధర రూ. 20 లక్షల కు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన 11 మ్యాచ్ లలో ఒక్కదానిలో కూడా అర్జున్ టెండూల్కర్ జట్టు తరపున బరిలోకి దిగలేదు. అయితే అర్జున్ టెండూల్కర్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్ సిమర్‌ జీత్ సింగ్‌ను జట్టులో చేర్చుకుంది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఇండియన్ ప్రీమియర్  మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్ ను పూర్తి చేసిన తర్వాత ఈ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ యూఏఈలో జట్టుతో శిక్షణ ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడే సిమర్‌జీత్ సింగ్, ఇటీవల వైట్-బాల్ పర్యటన కోసం శ్రీలంక కు వెళ్లిన భారత జట్టు నెట్ బౌలర్లలో ఒక్కడిగా వ్యవరించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: