ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు 13 సీజన్లు గడిచిపోయాయి. ప్రస్తుతం 14 సీజన్ జరుగుతోంది. అయితే ఈ జరిగిన 13 సీజన్లలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ ను అందుకోగా చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ గెలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ రెండుసార్లు టైటిల్ ను సాధించింది. అలాగే డెక్కన్ చార్జెస్ ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక సారి ఐపీఎల్ టైటిల్ ను అందుకుంది. ఇక ఇప్పటి వరకు టైటిల్ లు అందుకొని జట్లలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి, ఇక ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కి చేరుకోగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ప్లే ఆఫ్స్ బె బెర్తులు ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క బెర్తు కోసం పంజాబ్. ముంబై. కోల్ కతా, రాజస్థాన్ పోటీపడుతున్నాయి. అయితే ఈ ఏడాది ఐపిఎల్ టైటిల్ పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సేవ స్పందిస్తూ... ముంబై ఇండియన్స్ టాప్ ఫోర్ లోకి అడుగు పెట్టకూడదని కోరుకున్నాడు. ఎందుకంటే తనకు ఈ ఏడాది ఐపీఎల్ విన్నర్ గా కొత్త జట్టును చూడాలని ఉందని తెలిపాడు. ఒక వేళ ముంబై ప్లే ఆఫ్ కి చేరితే అక్కడినుండి ఫైనల్ కు సులువుగా వస్తుందని. ఇక ఫైనల్ లో టైటిల్ సాధిస్తుందని చెప్పాడు. కానీ అలా జరగకూడదని... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ అందుకొని పంజాబ్, బెంగళూరు, ఢిల్లీలలో ఎవరో ఒకరు టైటిల్ గెలిస్తే చూడాలని ఉందని అన్నాడు. అయితే ప్రస్తుతం 10 పాయింట్లతో ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక ఆరో స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్ కి రావాలంటే మిగిలిన మూడు మ్యాచ్లలో గెలవాల్సిందే. అయితే అది కొంచెం కష్టమే అయినా ముంబై ప్రతి సీజన్లో ఇలాగే చేస్తుంది. మొదటి మ్యాచ్లో ఓడిపోతూ ఆఖతో మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ కి వచ్చి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. కానీ ఈసారి అలా జరగకూడదని సెహ్వాగ్  కోరుకుంటున్నాడు. చూడాలి మరి సెహ్వాగ్  ఆశలు ఫలిస్తాయా... ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ను కొత్త జట్టు అందుకుంటుందా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: