యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నేడు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 50 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి అయితే ఇప్పటికే ఈ ఢిల్లీ, చెన్నై జట్లు ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్ లోకి చేరుకోవడంతోఈ మ్యాచ్ గెలుపోటములు ఆ జట్లపై పెద్దగా ప్రభావం చూపించావు. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకొని మొదట చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాటింగ్ కు పంపించింది. అలాగే మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అనుకున్న విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అంబటి రాయుడు ఒక్కడే అర్థ శతకంతో రాణించడం వల్ల ఆ జట్టు 136 పరుగులు చేసింది. ఇక 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో వచ్చిన ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది.

అయితే ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 18 పరుగులు చేసి వెనుదిరగగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 39 పరుగులతో రాణించాడు. ఇక గత మ్యాచ్ లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ 2 పరుగులకు ఔట్ కాగా ఢిల్లీ కెప్టెన్ 18 చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన రిపాల్ పటేల్18 పరుగులు చేయగా అశ్విన్ రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును గెలుపు వైపుకు నడిపించాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన కగిసో రబాడా మొదటి బంతికే బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే దీంతో  ఈ ఏడాది ఐపీఎల్లో పదవ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్లతో టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంది. అలాగే ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండవ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: