ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటకు ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ ప్రేక్షకులందరూ ఎక్కువగా ఇష్టపడేది టి20 ఫార్మాట్. టెస్ట్ క్రికెట్ గా ఏకంగా రోజుల తరబడి మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సిన పనిలేదు. గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఫలితం తేలిపోతూ ఉంటుంది. అంతేకాదు బరిలోకి దిగిన ప్రతి ఆటగాడు భారీగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే టి20 క్రికెట్ లో సింగిల్స్ కంటే సిక్సర్లు ఫోర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.


  ప్రతి బౌలర్ కూడా ఓవర్ లో కనీసం రెండు మూడు వికెట్లు పడగొట్టడానికి వైవిధ్యమైన బంతులను సంధిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మ్యాచ్ ఎంతో ఆసక్తి కరంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు పట్టే స్టనింగ్ క్యాచ్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇటీవల బిగ్ బాస్ లీగ్ లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఒక ఆసక్తికర చర్చ జరిగింది. బ్రిస్బేన్ జీతం 6s ఆటగాడు సీన్ అబౌట్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక అతను పట్టిన క్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా కాసేపు నమ్మలేక పోయారు అని చెప్పాలి.



 బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో జాసన్ బెండర్ సిస్ వేసిన బంతిని క్రిస్ లిన్ ఆఫ్ సైడ్ దిశగా కవర్ డ్రైవ్ చేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా సీన్ అబౌట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే క్రిస్ లిన్ తాను వికెట్ కోల్పోయానా లేదా అని మాత్రం కాసేపు సందేహం తో నే ఉన్నాడు. ఇక చివరికి అంపైర్ ఔట్ గా ప్రకటించడంతో నిరాశతో చివరికి రెండు పరుగులతో సరిపెట్టుకుని పెవిలియన్ చేరాడు క్రిస్ లిన్.  దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. క్యాచ్ పడుతున్న సమయంలో అతనిలో సూపర్ మాన్ స్పైడర్ మాన్ ఇలా అందరూ కనిపించారు అంటూ ఎంతో మంది క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: