భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎంత దిగ్గజ క్రికెటర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ భారత క్రికెట్ లో ఎక్కువ కాలం క్రికెట్ ఆడింది కూడా సచిన్ టెండూల్కరే.. కేవలం క్రికెట్ ఆడటం తో సరిపెట్టుకుంటాడా సంచలన రికార్డు కూడా క్రియేట్ చేశాడు. భారత క్రికెట్ ప్రేక్షకులకు మాస్టర్ బ్లాస్టర్ గా మారిపోయాడు.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒక స్ఫూర్తిగా నిలిచాడు.. టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు.. ఇలా ఒకప్పుడు టెండూల్కర్కు బౌలింగు చేయాలంటే భయపడిపోయే వారు బౌలర్లు.  అలా తన సత్తా చాటాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.


అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం సచిన్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. నా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని అనుకుంటున్నాడట మాస్టర్ బ్లాస్టర్. కొడుకు ఎదిగినప్పుడు కాదు ప్రయోజకుడు అయినప్పుడే అసలైన పుత్రోత్సాహం ఉంటుంది  అంటారు కదా.. ఇక ఇప్పుడు ఆ పుత్రోత్సాహం కోసమే సచిన్ లో టెన్షన్ పట్టుకుంది.. పాపం సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్  వేరే ప్రొఫెషన్ వైపు అడుగులు వేసిన ఇంత పెన్షన్ ఉండేది కాదేమో తండ్రిలాగే క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.


 మరి సచిన్ కొడుకు అన్నాక అంచనాలు ఏ రేంజిలో ఉంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ లోకి వస్తాడని  బాగా రాణించి అంతర్జాతీయ జట్టులో అవకాశం దక్కించుకుంటాడు అని అభిమానులు ప్రతి సీజన్ సమయంలో ఎదురు చూస్తున్నారు. కానీ ఏం చేస్తాం ప్రతి సీజన్లో నిరాశే ఎదురవుతుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో అవకాశం దక్కించుకున్నాడు అర్జున్ టెండూల్కర్. కెరియర్ మారిపోయినట్లే అనుకున్నారు అందరూ. కానీ ఒక్కసారి కూడా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.. కనీస ధర 20 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నాడు అర్జున్. అయినా ఎవరు ఈ  క్రికెట్ వారసుడి వైపు మాత్రం చూడటం లేదు. 22 అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు  క్రికెట్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఏమి చేయలేదు.  దీంతో అర్జున్ టెండూల్కర్ ఈసారైనా ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం సచిన్ టెండూల్కర్తో టెన్షన్ పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: