గత రెండు సంవత్సరాల ముందు వరకు టీమిండియాలో టెస్ట్ ఫార్మాట్ లో కీలక ప్లేయర్స్ గా రాణిస్తూ వచ్చిన చతేశ్వర్ పుజారా మరియు అజింక్య రహానే ల కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. గత సంవత్సరం నుండి వీరిద్దరూ సరైన ప్రదర్శన కనబరచడంలో విఫలం అయ్యారు. టీమిండియా చివరిగా ఆడిన టెస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాలో మాత్రమే. ఆ సిరీస్ ను దారుణంగా పోగొట్టుకుంది. సీనియర్ ఆటగాళ్లు అయినా వీరిద్దరూ ఉండి కూడా మ్యాచ్ లను గెలిపించలేకపోయారు, సిరీస్ ను కనీసం డ్రా కూడా చేయలేకపోయారు. ఈ సిరీస్ ముందు నుండి సెలెక్టర్లు నుండి వీరిద్దరికీ డేంజర్ బెల్స్ వెళుతూనే ఉన్నాయి.

కానీ వీరి ఆటతీరుతో మాత్రం మార్పు కనిపించలేదు. క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆఖరిది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా అక్కడ మూడు టీ 20 లు మరియు 2 టెస్ట్ లను ఆడనుంది. మార్చి 4 నుండి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే బీసీసీఐ సెలెక్టర్ చేతన్ శర్మ ఈ టెస్ట్ స్క్వాడ్ లో సీనియర్ ఆటగాళ్లు అయినా పుజారా మరియు రహానేలకు ఉద్వాసన పలికారు. ఏదైతే ఇంతవరకు జరగకూడదు అనుకున్నామో ఇప్పుడు అదే జరిగింది.

ఇకపై వీరిద్దరూ టీమిండియా టెస్ట్ జట్టులోకి రావాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తమ సత్తాను నిరూపించుకుని తీరాల్సిందే. అప్పటి వరకు అంతరాజాతీయ మ్యాచ్ లపై ఆశలు వదులుకోవాల్సిందే. మరి ఏమి జరగనుందో చూడాలి ఉంది. కాగా కొత్త టెస్ట్ కెప్టెన్ ఎవరు కానున్నారు అన్న ప్రశ్నకు కూడా చేతన్ శర్మ బదులిచ్చారు. రోహిత్ శర్మ ఈ పదవికి సరైనవాడు అంటూ అతను ఫిట్ గా ఉన్నంతకాలం కెప్టెన్ గా ఉంటాడు అని చెప్పకనే చెప్పాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: