గత కొన్ని సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ లో ఇంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిసారీ కూడా ఎంతో అద్భుతమైన పోరాటం సాగిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది అని చెప్పాలి. ఇక ఈసారి ఐపీఎల్ సీజన్ లో కూడా సరికొత్త ఆటగాళ్లు జట్టులోకి రావడంతో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. ఇక ఐపీఎల్ లో ఈసారి కూడా సత్తా చాటేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సిద్ధమైందని చెప్పాలి. అయితే ఇక మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా అంతలోనే ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.


 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న పృథ్వీ షా  చివరికి ఐపీఎల్ కు దూరం అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కారణం అతడు ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడమే. నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఐపీఎల్ ఆటగాళ్లకు ఇటీవలే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ ఫిట్నెస్  పరీక్షల్లో భాగంగా గుజరాత్ సారథిగా ఉన్నా హార్దిక్ పాండ్యా పాస్ అయ్యాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ లో కీలక ఆటగాడిగా ఉన్నప్పుడు పృద్వి షా విఫలం  అయ్యారు అనేది తెలుస్తుంది. యో యో టెస్టులో నిర్దేశించిన కనీస స్కోర్ను పొందడంలో హార్దిక్ పాండ్యా ఉత్తీర్ణత సాధించగా.. అటు పృద్వి షా మాత్రం చేతులెత్తేశాడు.



 దీంతో ఇక పృథ్వీ షా  అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో చేరి ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పాలి. కేవలం ఫిట్నెస్ టెస్ట్ మాత్రమేనని ఇందులో విఫలమైతే ఐపీఎల్లో ఆడకుండా ఆపలేము అంటూ బిసిసిఐ స్పష్టం చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ  ఊపిరిపీల్చుకుంది. కాగా యో యో టెస్టులో బీసీసీఐ నిర్దేశించిన కనీస స్కోర్ 16.5 కాగా పృథ్వీ షా 15 కంటే తక్కువ చేసినట్లు తెలుస్తోంది. అటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం 15కు పైగా స్కోర్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు పది రోజుల పాటు బీసిసిఐ ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: