ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి మాత్రం ఎందుకో ఊహించినంత రాణించలేక పోతోంది అని అభిమానులు నిరాశ చెందారు. ఢిల్లీ కాపిటల్ ప్రదర్శన ఎందుకు డీలా పడిపోయింది అని ఆందోళన చెందారు.  ఇక ఇలాంటి సమయంలోనే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్ సాధించిన అద్భుతమైన విజయం లో మునిగిపోయారు. ఇటీవల ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది  అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో భాగంగా అద్భుతమె జరిగింది అని చెప్పాలి. 116 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.


 ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు చెలరేగిపోయారు. కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఢిల్లీ జట్టు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60 పృథ్వీ షా  41 పరుగులతో రాణించారు.  అయితే అంతకు ముందు పంజాబ్ కింగ్  115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ అద్భుతమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యధిక ( 57)బంతులు మిగిలి ఉండగానే వందకుపైగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 116 పరుగుల లక్ష్యాన్ని 63 బంతుల్లోనే ఛేదించింది.


 గతంలో దక్కన్ చార్జర్స్  48 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్పై 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇక ఈ రికార్డు సాధించిన ఏకైక జట్టుగా కొనసాగుతోంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది అనే చెప్పాలి. ఖలీల్ అహ్మద్,కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒక వికెట్ సాధించాడు. అయితే అటు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల దెబ్బకి పంజాబ్ బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసి పేకమేడలా కూలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl