ఐపీఎల్ లో మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ ప్లే ఆప్స్ గురించి చర్చలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను బట్టి చూస్తే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ లు ప్లే ఆఫ్ చేరడం పక్కా అని తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం ముంబై మినహా అన్ని జట్లు పోట్లాడే పరిస్థితి నెలకొంది. ఇక అందులో భాగంగా ఈ రోజు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఎనిమిదవ స్థానంలో ఉన్న పంజాబ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం పంజాబ్ కు చాలా ముఖ్యం అని చెప్పాలి.

అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది అని తెలుస్తోంది. టోర్నీలో ఒకే ఒక్క పరాజయంతో ఐపీఎల్ సీజన్ 15 కు బాస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ బ్యాట్స్మన్ తడబడుతూ ఆడుతున్నారు. ఈ సిరీస్ లో ఒకే ఒక్క మ్యాచ్ లో రాణించిన శుబ్ మాన్ గిల్ ఈ మ్యాచ్ లోనూ ఫెయిల్ అయ్యాడు. ఇక గత మ్యాచ్ లో దూకుడుగా ఆడిన సాహా సైతం దొరికిన మంచి ఆరంభాన్ని బిగ్ స్కోర్ గా మలచలేకపోయాడు.

ఇక తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ ఒక్కడే నిలబడి నిదానంగా పరుగులు చేస్తున్నాడు. ఇక గత మ్యాచ్ హీరోలు మిల్లర్ మరియు తేవాతియా లు ఈ సారి ఆదుకోలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ దాదాపుగా పంజాబ్ చేతికి వెళ్ళిపోయినట్లే.. కానీ గుజరాత్ బౌలింగ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువ ఛేజింగ్ లో గెలిచినవే కావడం విశేషం. మరి ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ ఏ విధంగా రాణిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తేనే ముందుకు వెళుతుంది. లేదంటే ప్లే ఆప్స్ లో వెనకబడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: