సాధారణంగా క్రికెట్ మ్యాచ్ సాగుతున్న సమయంలో అటు బ్యాట్స్మెన్ ల మధ్య కోఆర్డినేషన్ ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వికెట్ల మధ్య పరుగులు పెడుతున్న సమయంలో ఇలాంటి కోఆర్డినేషన్ లేకపోతే చివరికి రన్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఇలా రనౌట్ అయి వికెట్ కోల్పోయిన బ్యాట్స్మెన్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో కూడా కోఆర్డినేషన్ మిస్అవ్వడం కారణంగా రనౌట్ అయిన వారు ఉన్నారు..ఇలాంటివి జరుగుతున్నప్పుడు బ్యాట్స్మెన్లు  కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక ఇటీవలే గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన జరిగింది. రన్ అవుట్ అయ్యే అవకాశం నుంచి రాహుల్ తేవాటియా తృటిలో తప్పించుకున్నాడు.  ఈ క్రమంలోనే  సహనాన్ని కోల్పోయాడూ. కోపంతో ఊగిపోయాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న స్థాయి సుదర్శన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్లలో భాగంగా రాహుల్ తేవాటియా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే రాహుల్ తేవాటియా బంతిని చూస్తూ సగం పిచ్ దాటేశాడు.  కానీ మరో ఎండ్ లో ఉన్న సాయి సుదర్శన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.


 దీంతో ఇది గమనించిన రాహుల్ తేవాటియా  మళ్లీ వెనక్కి పరిగెత్తడం మొదలు పెట్టాడు. అదృష్టవశాత్తు రనౌట్ కారణంగా వికెట్ కోల్పో లేదు. దీంతో ఇక స్థాయి సుదర్శన్ వైపు తిరిగి  తేవాటియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సింగిల్ వద్దని నోటితో చెప్పొచ్చు కదా అంటూ సీరియస్ లుక్ ఇస్తూ సహనం కోల్పోయాడు. ఇక ఇది చూసి ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. కాగా ఇక గుజరాత్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించి గుజరాత్ వరుస విజయాలకు కళ్లెం వేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: