ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఎలా రాణిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో తనను అవమానించి ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ పై డేవిడ్ వార్నర్ ఎంతో కసితోనే బ్యాటింగ్ చేశాడు. ఇక వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రివేంజ్ తీర్చుకోవాలనే కసి ప్రతి షాట్ లో కనిపించింది అని చెప్పాలి. ఏకంగా 92 పరుగులతో అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు డేవిడ్ వార్నర్.

 ఈక్రమంలోనే డేవిడ్ వార్నర్ సెంచరీ సాధించడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం డేవిడ్ వార్నర్ సెంచరి చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపలేదు.. ఇక మరో ఓవర్ మిగిలి ఉంది అన్న సమయంలో రోమన్ పావెల్ సింగిల్ తీస్తే వార్నర్ కు బ్యాటింగ్ వస్తుంది. కానీ ఆ ఓవర్ లో అన్ని బంతులు ఆడి  3 సిక్సర్లు ఒక ఫోర్  బాదాడు పావెల్. అయితే ఇటీవలే వార్నర్ సెంచరీ చేయకపోవడంపై అతనికి స్ట్రైక్ ఇవ్వకపోవడంపై రోవ్మన్ పావెల్ అసలు విషయాన్ని చెబుతూ వచ్చాడు. ఓవర్ కు ముందే సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలా..  సెంచరీ చేస్తావా అని వార్నర్ ను అడిగాను. కానీ వార్నర్ మాత్రం వద్దు అని  చెప్పాడు.


 క్రికెట్ అలా ఆడకూడదని.. వీలైనన్ని షాట్స్ కొట్టమని అతడు నాతో చెప్పాడు. వార్నర్ చెప్పింది నేను కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇక ఈ మ్యాచ్లో భాగంగా 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోమన్ పావెల్ 67 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సాధారణంగా 20 బంతులు ఆడి క్రీజ్లో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడటమే నా శైలి. అందుకే మిడిలార్డర్లో తనను బ్యాటింగ్ పంపాలని కెప్టెన్ రిషబ్ పంత్ ని కోరుకున్నాను అంటూ పావెల్ చెప్పాడు. అయితే ఇక వార్నర్ సెంచరీ వదులుకోవడం విషయం తెలిసిన తర్వాత వార్నర్ కి సన్రైజర్స్ పై ఉన్న అభిమానంతోనే ఇలా చేశాడు అంటూ ఎంతోమంది సన్రైజర్స్ అభిమానులు చర్చించుకుంటూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: