భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ ను కోల్పోయి ప్రపంచం అంతటా విమర్శలను ఎదుర్కొంటుంన్నాడు. అంతర్జాతీయ సెంచరీ చేయడానికి రెండు సంవత్సరాలు తీసుకున్న ఇంకా అది లోటుగానే మిగిలిపోయింది. కెరీర్ లో 71వ సెంచరీ కోసం ప్రపంచంలోని కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతకాలం నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది అంటున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు. మరి సెంచరీ చేస్తాడో లేదా అన్నది పక్కన పెడితే మునుపటిలా తన ఫామ్ ను అందుకోవడం మాత్రం పక్క అని తెలుస్తోంది. ఆగష్టు 28 నుండి ఆసియా కప్ 2022 మొదలు కానుంది. 

ఇండియా తన మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తలపడనుంది. ప్రపంచం అంతటా ఈ రెండు జట్ల మధ్యన జరిగే పోటీని చూడడానికి సిద్ధంగా ఉంటారు. ఆసియా కప్ లో కోహ్లీ కి అభేద్యమైన రికార్డు ఉంది. కోహ్లీ తన కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు 3 ఆసియా కప్ లలో భాగం అయి  ఉన్నాడు. ప్రస్తుతం ఆడబోయేది నాలుగవది అవుతుంది. ఇంతకు ముందు ఆసియా కప్ వన్ డే ఫార్మాట్ లో నిర్వహించేవారు. కానీ కాలానుగుణంగా దానిని 20 ఓవర్లకు కుదించారు. కోహ్లీ వన్ డే ఫార్మాట్ ఆసియా కప్ లో 16 మ్యాచ్ లను ఆడాడు. ఇందులో 63.83 సగటుతో మొత్తం 766 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ పరుగులలో 3 సెంచరీలు మరియు 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇక 20 ఓవర్ల ఆసియా కప్ ఫార్మాట్ లో మొత్తం 5 మ్యాచ్ లలో కలిపి 153 పరుగులు చేశాడు. ఇలా ఎలా చూసుకున్నా కోహ్లీ ఆసియా కప్ లో కింగ్ గా  ఉన్నాడు. కాబట్టి ఇంకొద్ది రోజుల్లో జరగబోయే ఆసియా కప్ తో తన మునుపటి ఫామ్ ను అందుకుని పరుగుల వరద పారించడం ఖచ్చితం. ఇలా అంత అనుకున్నట్టు జరిగితే ప్రత్యర్థులకు చుక్కలే ?

మరింత సమాచారం తెలుసుకోండి: