టి20 వరల్డ్ కప్ కి ముందు ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించిన క్రికెటర్ ఆరోన్ ఫించ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా వన్డే ఫార్మాట్   కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది అందరికీ షాకిచ్చాడు.. అయితే టి20 ఫార్మాట్ కి మాత్రం కెప్టెన్గా కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు ఆరోన్ ఫించ్. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇలాంటి పరిణామాలు అందరినీ షాక్ కి గురి చేశాయి. కాగా వన్డే ఫార్మాట్ కు  ఎవరు కొత్త కెప్టెన్గా మారబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 ఇలాంటి సమయంలోనే పలువురు పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కాగా ఎవరూ ఊహించని విధంగా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టు వన్డే ఫార్మాట్ కు   కెప్టెన్గా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో బాల్ టాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్నర్ కెరీర్లోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 క్రికెట్ ఆస్ట్రేలియా అతనిపై రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది.. అంతేకాకుండా ఒక జీవితకాల కెప్టెన్సీ  నిషేధం కూడా డేవిడ్ వార్నర్ పై కొనసాగుతుంది  అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కు వన్డే ఫార్మాట్  కెప్టెన్సీ అప్పగిస్తారు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధం ఎత్తివేయాలని డేవిడ్ వార్నర్ బోర్డును కోరే అవకాశముంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఇందుకు అంగీకరిస్తే అతను వన్డే కెప్టెన్ గా అవతరిస్తాడు. సీనియర్ కావడం మంచి ఫామ్లో ఉండడం కూడా కలిసి వచ్చే అంశమే.

మరింత సమాచారం తెలుసుకోండి: