టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ఎప్పుడూ తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాడు అన్న విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ అనే పదానికి అసలు అసలైన అర్థాన్ని ఇచ్చే ఆటగాడు  రవీంద్ర జడేజా అని క్రికెట్ ప్రేక్షకులు కూడా చెబుతూ ఉంటారు. బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్.. ఇలా క్రికెట్ లో ఉన్న అన్ని విభాగాల్లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు అని చెప్పాలి. అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్లో  విధ్వంసం సృష్టించినప్పుడు తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. 50 లేదా సెంచరీ కొట్టి నప్పుడు తన బ్యాట్ ను ఒక చేతిలో పట్టుకొని కత్తిసాము చేస్తున్నట్లుగా తిప్పుతాడు.


 ఇలా రవీంద్ర జడేజా ఎన్నో సార్లు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ప్రపంచ కప్ లో మాత్రం ప్రేక్షకులు ఇది మిస్ కాబోతున్నారు. ఎందుకంటే ఇటీవల మోకాలి గాయం బారినపడి శస్త్రచికిత్స చేయించుకున్న రవీంద్ర జడేజా చివరికి  జట్టుకు దూరం అయ్యాడు. ఈ క్రమంలోనే టీ-20 ప్రపంచకప్ లో అతను అందుబాటులో ఉండలేకపోయాడు అనే విషయం తెలిసిందే.  గాయంపై ఇటీవల స్పందించిన రవీంద్ర జడేజా వీలైనంత త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ తెలిపాడు.


 ఈ క్రమంలోనే  రవీంద్ర జడేజా త్వరగా కోలుకోవాలనీ ఎంతమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. అయితే యువ క్రికెటర్ చేతన్ సకారియా ఇటీవలే రవీంద్ర జడేజ స్టైల్ను అనుకరించి వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. రవీంద్ర జడేజా లాగానే కత్తి సాములో తన బ్యాట్ ను తిప్పేందుకు  ప్రయత్నించాడు.  దాదాపు జడేజాను గుర్తుచేస్తూ ఒంటిచేత్తో బ్యాట్ తిప్పేశాడు. జడేజా భయ్యాను మిస్ అవుతున్నాను అనుకునేవాళ్లు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. జడ్డు బాయ్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూన్న అంటూ  ఒక కామెంట్ కూడా రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన రవీంద్ర జడేజా థాంక్ యూ అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: