సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అటు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండాలని భావిస్తూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాగా ఒకప్పుడు ఐసీసీ విడుదల చేసే టి20, వన్డే ర్యాంకింగ్స్ లో అటు భారత ఆటగాళ్లు ఎప్పుడు టాప్ 10 లో ఎక్కువ మంది చోటు సంపాదించుకునేవారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక విరాట్ కోహ్లీ అయితే ఎన్నో ఏళ్ల పాటు టి20 ఫార్మాట్ లో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చాడు.


 అయితే గత కొంతకాలం నుంచి ఎందుకో భారత జట్టుకు సంబంధించిన ఆటగాళ్లు ఎక్కువగా ర్యాంకింగ్స్ లో తమ ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. కొంతమంది ఆటగాళ్ళు అయితే కనీసం అటు టాప్ 10 లో కూడా చోటు దక్కించుకోలేకపోతు ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అభిమానులు ఎంతగానో నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే ఫార్మా ర్యాంకింగ్స్ ని ఇటీవల ప్రకటించగా.. మరోసారి టీమిండియా క్రికెటర్లకు నిరాశ ఎదురయింది అని చెప్పాలి. టీమ్ ఇండియా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ఫైవ్ లో విరాట్ కోహ్లీ గాని రోహిత్ శర్మ గాని చోటు దక్కించుకోలేదు.


 ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ర్యాంకింగ్ వివరాలు చూసుకుంటే భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం 890 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్ లో బాబర్ అజం తర్వాత స్థానంలో ఇమామ్ అప్ హక్ 779 పాయింట్లతో రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వాన్ డెర్ డసేన్ 766 పాయింట్లు, డీ కాక్ 759 పాయింట్లు, జానీ బేయిర్ స్ట్రో 732 పాయింట్లు, డేవిడ్ మిల్లర్ 725 పాయింట్లు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 722 పాయింట్లు, రోహిత్ శర్మ 718 పాయింట్లతో ఉన్నాడు. అయితే తన కెరీర్ లోనే మొదటిసారి విరాట్ కోహ్లీ టాప్ ఫైవ్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకోలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: