ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటి నుండి మొదలైన ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే 2 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు జరిగాయి. అందులో ఒక సంచలనం నమోదు అయింది.. ఇటీవల ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక పసికూన నమీబియా చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. నమీబియా ఇచ్చిన 164 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది.. దీనితో శ్రీలంక కు తర్వాత స్టేజ్ కు వెళ్లడం కష్టంగా మారిందని చెప్పాలి. కాగా ఇదే తరహాలో ఈ రోజు జరిగిన మరో మ్యాచ్ లో సంచలనం నమోదు అయింది. వెస్ట్ ఇండీస్ మరియు స్కాట్లాండ్ ల మధ్య జరిగిన మూడవ మ్యాచ్ లో స్కాట్లాండ్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఓటమిని మూటగట్టుకుంది.

ఇంతకు ముందు జరిగిన వరల్డ్ కప్ చరిత్రలో ఇలాంటివి ఎన్నో సంచలనాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్ చాలా ప్రత్యేకంగా అని చెప్పాలి. టాస్ ఒదిన స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది... నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అయితే స్కాట్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తీరు చూస్తే కనీసం 180 పరుగులు చేస్తుంది అనిపించింది. కానీ మధ్య ఓవర్ లలో వెస్ట్ ఇండీస్ బౌలర్లు పుంజుకుని స్కాట్లాండ్ ను కట్టడి చేశారు. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మున్సీ 53 బంతుల్లో 66 పరుగులు చేశాడు.. ఇతనికి జోన్స్ , గ్రీవ్స్ లు చక్కగా సహకరించారు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ మరియు హోల్డర్ లు తలో రెండు వికెట్లు తీశారు.

161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన విండీస్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. మార్క్ వాట్ మూడు వికెట్లు తీసి విండీస్ ను దెబ్బ తీశాడు.. ఇతనికి బ్రాడ్ వీల్ మరియు లీస్క్ లు చక్కగా సహకరించారు. విండీస్ కేవలం 118 పరుగులు చేసి ఆల్ అవుట్ చేసి వరల్డ్ కప్ ను ఘనంగా స్టార్ట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: