టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ ఊహించిన దానికంటే అసలు సిసలైన క్రికెట్ మజా అందుతుంది అని చెప్పాలి. వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న టీం ల దగ్గర నుంచి అటు పసికూన జట్ల వరకు కూడా అందరూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక పసికూన జట్లు ఏకంగా వరల్డ్ ఛాంపియన్ జట్లను సైతం ఓడిస్తు ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ అదరగొడుతున్నారు. కాగా ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి ఆయా జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్ లో కూడా అరుదైన రికార్డు నెలకొల్పుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల శ్రీలంక యూఏఈ మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేసాడు యూఏఈ బ్యాట్స్మెన్. అయితే యూఏఈ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక వరల్డ్ కప్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో  పదునైన వ్యూహాలతో బలులోకి దిగిన శ్రీలంక చివరికి యూఏఈ పై విజయం సాధించింది.



 అయితే శ్రీలంక జట్టు విజయం సాధించినప్పటికీ అటు అరుదైన రికార్డులు సృష్టించింది మాత్రం యూఏఈ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లే కావడం గమనార్హం. యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ అప్పటికి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అయితే ఇదే టీం కు చెందిన బ్యాట్స్మెన్ జునైద్ సిద్ధిక్ వరల్డ్ కప్ లో భారీ సెక్స్ కొట్టాడు. ఏకంగా 109 మీటర్లు సిక్సర్ బాదాడు. అయితే అతను స్వతహాగా బౌలర్ కావడం గమనార్హం.  ఇక ఈ వరల్డ్ కప్ లో ఇదే అతిపెద్ద సిక్స్ అని చెప్పాలి. పదవ స్థానంలో వచ్చి అతడు ఇంత భారీ సిక్సర్ కొట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: