సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు యార్కర్ లతో అటు బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది బౌలర్లు అద్భుతమైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొట్టడం లాంటివి అటు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి. ఇక ఇలాంటి యార్కర్ స్పెషలిస్ట్ గా కొనసాగుతూ ఉన్నాడు పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది. తన అద్భుతమైన యార్కర్లతో కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బలహీన పరుస్తూతమ జట్టును విజయతీరాలకు చేరుస్తూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇక షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో యార్కర్లే అతని పెద్ద బలం అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది  యార్కర్ దెబ్బకు ఏకంగా విద్యార్థి బ్యాట్స్మెన్ ఆస్పత్రి పాలైన ఘటన కాస్త అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షాహిన్ ఆఫ్రిది  యార్కర్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ రహమాన్ ఉల్లా గుర్బాజ్ గాయం బారిన పడ్డాడు. అయితే రహమనుల్లా యార్కర్ డెలివరీతో ఎల్బీ గా పెవిలియన్ చేరాడు అని చెప్పాలి.

 షాహిన్ ఆఫ్రిది వేసిన బుల్లెట్ లాంటి యార్కర్ చివరికి రహమనుల్లా గుర్బాజ్ కాలికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో అల్లాడిపోయాడు గుర్బాజ్.  వెంటనే ఫిజియోని పిలిపించుకొని మసాజ్ కూడా చేయించుకున్నాడు. అయినప్పటికీ అతను నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఫిజియోలు అతని భుజం మీద ఎక్కించుకొని పెవీలియన్ తీసుకువెళ్లారూ. ఇక ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్లు ప్రారంభం కావడానికి ముందు రహమనుల్లా గుర్బాజ్ గాయంతో దూరమైతే మాత్రం ఆఫ్గనిస్తాన్కు అతి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: