టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఇక ఎవరినైనా ప్రశంసించాలి అంటే చాలు అందరిలా కాకుండా భిన్నమైన శైలిలో కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ వీరోచిత్తమైన  ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాకు విజయాలను అందించిన తీరుపై కూడా రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే మొదట విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఎవరికి అర్థం కాలేదు అని చెప్పాలి.


 అయితే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కఠిన పరిస్థితుల మధ్య ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ 53 బంతులు 82 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి  ఇక విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కి మ్యాచ్ కూ కామెంటేటర్ గా ఉన్నవారు సైతం మైదానంలోకి వచ్చి చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ గంతులు వేశారు. ఇక విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ చూసిన తర్వాత మాత్రం ట్రోలర్స్ కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలోనే కామెంట్రీ లో ఒక మాట వినిపించింది cometh the hour, cometh the stage, cometh the man అంటూ కొన్ని మాటలు వినిపించగా ఈ మాటలు ఎవరికీ అర్థం కాలేదు.


 ఇక ఈ హాట్ కామెంట్లను రవి శాస్త్రి చేయడం గమనార్హం. అయితే ఇక ఇందుకు అర్థం ఏంటి అన్న విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూశారు అందరు. ఇంతకీ ఈ మాటలకూ అర్థమేంటి అంటే విరాట్ కోహ్లీ పర్ఫెక్షన్ ను వివరించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోయాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. సమయం వీలుగా లేనప్పుడు.. ఆ వ్యక్తి వచ్చి మొత్తం పరిస్థితులను తన వైపు తిప్పుకుంటాడు.. విజయాన్ని సాధిస్తాడు అంటూ రవి శాస్త్రి కామెంట్ చేసాడు. ఇక దీని అర్థం తెలిసిన తర్వాత కోహ్లీ ఆట తీరుకు సరిగా సరిపోయే పదాలను రవి శాస్త్రి చెప్పాడు అంటూ ఎంతో మంది అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: