సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం భారత క్రికెట్లో ఇతని పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా యువ ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఇతనికి కాస్త ఆలస్యంగానే భారత జట్టులో చోటు దక్కింది. కానీ జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఏకంగా భారత జట్టులో అగ్రశ్రేణి బ్యాటర్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే తాను భిన్నమైన ఆటగాడిని అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తోనే నిరూపిస్తూ వస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.


 ఇకపోతే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన సూర్య కుమార్ యాదవ్ తన కెరీర్లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను.. భారత జట్టులో చోటు సంపాదించడానికి తాను చేసిన ప్రయత్నాలను గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 2017- 18 నుంచి తాను తన భార్య ఇక హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని ప్రయత్నించాం. ఈ క్రమంలోనే అప్పటి నుంచి నా శిక్షణను భిన్నంగా మొదలుపెట్టాను. ఆఫ్ సైడ్ ఆడటం ఎక్కువగా దృష్టి పెట్టాను. దీంతో పాటు డైటింగ్ కూడా మొదలుపెట్టి ఫిట్నెస్ పెంచుకున్నాను. ఇవన్నీ కూడా 2018 - 19 దేశవాళీ టోర్నీ లో ఉపయోగపడ్డాయి.


 2020 నాటికి నా శరీరం పూర్తిగా మారిపోయింది. నా శరీరం దేనికి అలవాటు పడింది... నాకు ఏది సహాయపడుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఏడాదిన్నర సమయం పట్టింది. ఇక క్రమంగా అన్నింటినీ గ్రహించి సరైన దిశలో ప్రయాణం మొదలు పెట్టాను. ఇక అప్పటినుంచి నా కెరియర్ లో ప్రతిదీ దానంతట అదే జరిగిపోయాయి. నేను జట్టు కోసం ఏం చేయాలి నా సాధన ఎంత మేరకు ఉండాలి అన్న విషయాలు కూడా నాకు అర్థం అయ్యాయి. నేను మొద్దుగా సాధన చేసే వాడిని కొన్నిసార్లు చిరాకు కూడా వచ్చేది. కానీ ఆ తర్వాత స్మార్ట్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇక టీమ్ ఇండియాలో చోటు దక్కింది అంటూ సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: