టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం కొన్ని దేశాల క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే తమ దేశ జట్టు అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నప్పటికీ కనీసం మ్యాచ్ జరగకుండానే ఇక వర్షార్పణం అవుతూ ఉండడం జరుగుతుంది. ఇలా వర్షం కారణంగా పలు మ్యాచ్లు రద్దు అవుతూ ఉండడంతో ఇక ప్రదర్శనతో సంబంధం లేకుండా ఆయా జట్లు చివరికి సెమీస్ వెళ్లే అవకాశాలు కోల్పోతూ ఉండడం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే ఐసీసీ వర్షాలు పడుతున్న సమయంలో వరల్డ్ కప్ నిర్వహిస్తూ ఉండడంపై ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే ఇక తమ దేశ జట్ల గురించి కామెంటేటర్లు  ఏదైనా విచిత్రంగా మాట్లాడితే వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. ఇక ఇటీవలే అటు టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్  చేసిన వ్యాఖ్యలపై ఒక అభిమాని కాస్త ఘాటుగానే స్పందించాడు. మీరు కాస్త హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..  టి20 ప్రపంచ కప్ లో భాగంగా జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్  వర్షార్పణం అయ్యింది.


 ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్ జట్ల విషయంలో వీరేంద్ర సెహ్వాగ్, పార్దేవ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ రెండు దేశాల జట్లను కూడా సభ్య దేశాలుగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు అని చెప్పాలి  ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ ప్రీ మ్యాచ్ షోలో భాగంగా వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్  పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇలా ఆఫ్గనిస్తాన్ ఐర్లాండ్లను సభ్య దేశాలుగా పేర్కొంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ఈ రెండు జట్లు  ఐసీసీలో శాశ్వత  జట్లుగా ఎప్పుడో గుర్తింపు పొందాయ్. ఇది మర్చిపోయి సభ్య దేశాలు అనడం ఒక అభిమానికి చిరాకు తెప్పించింది.  వెంటనే సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ మీరు కాస్త హుందాగే నడుచుకుంటే బాగుంటుంది అంటూ చురకలు అంటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: