వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి. ఎవరు ఊహించిన విధంగా అటు దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న టీమ్ లకు సైతం గడ్డుకాలం ఏర్పడింది అని చెప్పాలి. కొన్ని జట్లు పేలవ ప్రదర్శనతో కష్టకాలాన్ని తెచ్చుకుంటే మరికొన్ని జట్లు మాత్రం వరుణుడి శాపం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో కష్ట కాలాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సెమి ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే తప్పక గెలవడమే కాదు భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితులు కూడా కొన్ని టీమ్లకు ఏర్పడ్డాయి అని చెప్పాలి.


 ఇక మరికొన్ని జట్లు సెమిస్ లో అడుగు పెట్టాలంటే ఇతర జట్ల జయాపజాలపై ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సెమీఫైనల్ లో అడుగు పెట్టాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయాన్ని సాధించి సేమిస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఇప్పుడు మరో దిగజా జట్టు అయిన ఇంగ్లాండు వంతు వచ్చింది. కాగా నేడు వరల్డ్ కప్ లో భాగంగా రెండు కీలకమైన మ్యాచ్లు జరగబోతున్నాయి అని చెప్పాలి.



 తొలి మ్యాచ్ లో భాగంగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇంగ్లాండు, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.. ఈ పోరు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అయితే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలి అంటే మాత్రం అటు ఐర్లాండ్ చేతిలో ఓడిన  ఇంగ్లాండ్ జట్టు తప్పక గెలిచి తీరాల్సిందే అన్న విషయం తెలిసిందే  మరోవైపు అటు శ్రీలంకకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. దీంతో రెండు మ్యాచ్లలో కూడా మరోసారి హోరాహోరీ పోరు ప్రేక్షకులు చూడబోతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: