ఈ రోజు జరిగిన కీలక మ్యాచ్ లో వచ్చిన ఫలితం ద్వారా గ్రూప్ గ్రూప్ 1 నుండి సెమీస్ కు అర్హత సాధించే రెండు జట్ల గురించి సస్పెన్స్ ఇంకా కొనసాగనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. గత రెండు వారాలుగా మంచి కిక్ ఇచ్చే గేమ్ లతో అలరిస్తున్న వరల్డ్ కప్ లో ఇంకా కొన్ని మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 12 జట్లు పోటీ పడిన ఈ టోర్నీలో నాలుగు జట్లు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తాయి. మిగిలిన ఎనిమిది జట్లు ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పటికే గ్రూప్ 1 మరియు 2 లలో నెదర్లాండ్ , జింబాబ్వే, ఆఫ్గనిస్తాన్, ఐర్లాండ్ లు అనధికారికంగా సెమీస్ పోటీలో లేవు. దీనితో ఇండియా , సౌత్ ఆఫ్రికా , బంగ్లాదేశ్, పాకిస్తాన్ , న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ మరియు శ్రీలంకలు ఇంకా రేసులోనే ఉన్నాయి.

కాగా గ్రూప్ 2 నుండి సౌత్ ఆఫ్రికా ఇండియా లు సెమీస్ కు వెళ్లడం పక్కా అని తెలుస్తోంది. ఇక గ్రూప్ 1 లోనే సందిగ్దత నెలకొంది. ఈ రోజు ఇంగ్లాండ్ మరియు కివీస్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కివీస్ గెలిచి ఉంటే సెమీస్ కు అర్హత సాధించి ఉండేది. కానీ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలవడం వలన రేస్ లో ఈ రెండు జట్లతో పాటుగా ఆస్ట్రేలియా మరియు శ్రీలంకలు కూడా సజీవంగా ఉన్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి ఉన్నాయి. కానీ పాయింట్ల  పరంగా చూస్తే కివీస్ , ఇంగ్లాండ్ మరియు ఆసీస్ లకు తలో అయిదు పాయింట్లు ఉన్నాయి. కానీ శ్రీలంకకు మాత్రం నాలుగు పాయింట్లు ఉన్నాయి అంతే. కాబట్టి శ్రీలంక సెమీస్ కు వెళ్లాలంటే చాలా సమీకరణాలు మారాలి... తర్వాత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై గెలిస్తే పాయింట్లు 6 దక్కుతాయి.

అప్పుడు ఇంగ్లాండ్ 5 పాయింట్లతో సెమీస్ కు చేరలేదు. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే శ్రీలంక ఖేల్ ఖతం. ఇక అదే సమయంలో కివీస్ ఎలాగో ఐర్లాండ్ తో గెలుస్తుంది.. అప్పుడు కివీస్ 7 పాయింట్లతో  సెమీస్ చేరుతుంది. ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లోనూ ఆసీస్ గెలుపు ఖాయం. కానీ రన్ రేట్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కివీస్ మరియు ఇంగ్లాండ్ లు రన్ రేట్ పరంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మరి సెమీస్ కు అర్హత సాధించే రెండు జట్లు ఏవో తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: