అతను మంచి ఫామ్ లో లేడు. జట్టుకు భారంగా మారిపోతూ ఉన్నాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం అతన్ని జట్టు నుంచి పీకి పారేయండి.. మరొకరిని జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరగడానికి ముందు వరకు కూడా కేఎల్ రాహుల్ గురించి ఇలాంటి విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపించాయి. వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విమర్శకుల నోళ్లు ముయించాడు అని చెప్పాలి.


 ఏకంగా 31 బంతుల్లోనే 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.   ఆస్ట్రేలియాతో జరిగిన వార్మమ్ మ్యాచ్లో ఆర్ధ శతకంతో రాహుల్ చెలరేగాడు. ఇప్పుడు ప్రపంచ కప్ టోర్నీలో కీలకంగా నిలుస్తాడేమో చూద్దాం.


 ఒక ఇన్నింగ్స్ బాగా ఆడినంత మాత్రాన గొప్ప ఆటగాడు అని అనలేము.. అలాగే బాగా ఆడకపోతే చెడ్డ ఆటగాడిగా కూడా భావించలేం.. మనం వారికి కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు రాహుల్ ఆడిన ఒక షాట్ తో అంతా మారిపోయింది. రాహుల్ మళ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాడు.. నిజానికి అయితే అతను ఎప్పుడూ ఫామ్ లోనే ఉన్నాడు. ఎంత బాగా ఆడాలనుకున్న.. అది ప్రపంచ కప్.. ప్రపంచం మొత్తం మొత్తం మీ ఆటను గమనిస్తూ ఉంటుంది. మ్యాచ్ సరిగా ఆరంభించకపోతే ఆ క్రికెటర్ ఆటను శంకించాల్సిన అవసరం లేదు. రాహుల్ ఆట తీరును ఎవరు నియంత్రించలేరు. అది అతనికి మాత్రమే సాధ్యం అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: