సాధారణంగా టి20 ఫార్మాట్ అంటే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు పోర్లతో చలరేగిపోతూ ఉంటారు. అయితే టి20 ఫార్మాట్లో ఇక బ్యాట్స్మెన్లకు బౌలింగ్ చేయడం మాత్రం స్టార్ బౌలర్లకు సైతం సవాలతో కూడుకున్నది. ఎందుకంటే ఒకవైపు పరుగులను కట్టడి చేయడమే కాదు మరోవైపు వికెట్లను కూడా పడగొట్టాల్సి ఉంటుంది. లేదంటే చివరికి తీవ్రస్థాయిలో విమర్శల పాలు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధారణ టీ20 మ్యాచ్ లలోనే ఇలా పరిస్థితి ఉంటే.. టి20 వరల్డ్ కప్ లో ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇలా తీవ్రమైన ఒత్తిడి మధ్య వికెట్లు పడగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఇక హ్యాట్రిక్స్ సాధించడం అంటే అది ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో కేవలం కొంతమంది బౌలర్లు మాత్రమే హ్యాట్రిక్ రికార్డును సాధించి చరిత్ర సృష్టించారు. కాగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్లో ఒక హ్యాట్రిక్ నమోదయింది. ఇక ఇప్పుడు సూపర్ 12 మ్యాచ్లలో కూడా మరో హ్యాట్రిక్ నమోదు కావడం గమనార్హం. ఇటీవల న్యూజిలాండ్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐర్లాండ్ బౌలర్ హ్యాట్రిక్ నమోదు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.



 ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ పై 35 పరుగులు తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ విజయం సాధించినప్పటికీ అటు ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఏకంగా హ్యాట్రిక్ సాధించాడు. అది కూడా ఎంతో ఒత్తిడితో కూడుకున్న 19 ఓవర్ లో. కెన్ విలియమ్స్  క్యాచ్ అవుట్, నీషమ్ ఎల్ బి డబ్ల్యూ, శాంట్నర్ ఎల్బిడబ్ల్యు ఇలా వరుస బంతులలో వెనక్కి పంపాడు. ఇలా వరుసగా మూడు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన 185 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత లక్ష్య చేదనలో ఐర్లాండ్ తడబడడంతో ఓటమి చవి చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: