ఇటీవలే మేల్ బోర్న్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి రెండోసారి టి20 వరల్డ్ కప్ సాధించాలని ఆశపడిన పాకిస్తాన్ జట్టుకు ఊహించని రీతిలో నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి కేవలం రన్నరఫ్ గా మాత్రమే సరిపెట్టుకుంది. అయితే షాహిన్ ఆఫ్రిది గాయం కారణంగా దూరం కావడం కారణంగానే తమ జట్టు ఓడిపోయిందని షాహిన్ ఆఫ్రిది ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని ఓటమి అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  వ్యాఖ్యానించాడు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ చేసిన వ్యాఖ్యలను మాత్రం భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తోసిపుచ్చాడు.



 ఒకవేళ అదృష్టవశాత్తు పాకిస్తాన్ జట్టుకు షాహిన్ ఆఫ్రిది అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్ గెలిచేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ... పాక్ ఓటమికి లేకపోవడం  ప్రధాన కారణం అస్సలు కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తొలుత  బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయింది. ఒకవేళ మరో 15 నుంచి 20 పరుగులు అదనంగా చేసి ఉంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో.. బౌలర్లపై కూడా ఒత్తిడి ఉండేది కాదు. అయితే షాహిద్ జట్టులో ఉన్నప్పటికీ  అతనికి కేవలం 11 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 11 బంతులు ఇంగ్లాండ్ పై ఎలాంటి ప్రభావం చూపకపోయి ఉండేవి. బహుశా పాకిస్తాన్ కి మరో వికెట్ లభించి ఉండవచ్చు. అంతే తప్ప ఇంగ్లాండ్ మాత్రం కచ్చితంగా గెలిచి ఉండేది అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.



కాగా ఈ మ్యాచ్ లో భాగంగా 2.1 ఓవర్లు వేసిన షాహిన్  13 పరుగులు ఇచ్చాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఒక క్యాచ్ పట్టిన సమయంలో మోకాలి గాయం తిరగబెట్టడంతో ఇక మైదానం వీడి వెళ్లిపోయాడు. అయితే మళ్లీ వైద్యుల చికిత్స అనంతరం మైదానంలోకి వచ్చినప్పటికీ బౌలింగ్ వేయలేకపోయాడు. దీంతో ఒకే ఒక బంతివేసి మైదానం వీడి వెళ్ళిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: