ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే వరల్డ్ కప్ లో వైఫల్యం నేపథ్యంలో ఇక రోహిత్ శర్మను అటు టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి తప్పించి హార్థిక్ పాండ్యాకు సారాధ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని గత కొంత కాలం నుంచి ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇంత సడన్గా రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించడం ఏంటి అన్న విషయంపై చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో బీసీసీఐ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.


 చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో పాటు ఇక సెలక్షన్ కమిటీ మొత్తాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకొని షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఇక కొత్త సెలక్షన్ కమిటీ నియామకం చేపట్టబోతున్నట్లు తెలిపింది. ఇక ఈనెల 25 వరకు సెలక్షన్ కమిటీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది అంటూ బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీస్ స్పష్టం చేశారు. ఇక ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.  ఇంత సడన్గా సెలక్షన్ కమిటీని రద్దు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందబ్బా అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు..


 అదే సమయంలో ఇక ప్రస్తుతం సెలక్షన్ కమిటీని రద్దు చేసిన నేపథ్యంలో  బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎవరు కాబోతున్నారు అన్నదానిపై కూడా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా  ఒక పేరు తేర మీదికి వచ్చింది. టీమిండియా మాజీ స్టార్ బౌలర్ లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేరుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది. 2020లో కూడా చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు శివరామకృష్ణన్. ఆ టైంలో మాజీ చైర్మన్ ఎస్ శ్రీనివాసన్ అతనికి మద్దతు తెలిపిన.. ఇక బీసీసీఐ చైర్మన్ సౌరబ్ గంగూలీ మాత్రం సునీల్ జోషిని ఎంపిక చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: