ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా జట్టు అక్కడ టీ20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మొన్నటికి మొన్న రెండవ మ్యాచ్ జరిగింది. ఇక ఈ రెండవ మ్యాచ్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా జట్టు 65 పరుగులు తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడవ టి20కి సమయం ఆసన్నమైంది.


 అయితే గత కొంతకాలం నుంచి టీమిండియాలో చోటు కోల్పోయిన మహమ్మద్ సిరాజ్,  చాహాల్ లకు రెండవ టి20 మ్యాచ్ లో ఛాన్స్ దక్కింది. దీంతో ఇద్దరు మంచి ప్రదర్శన కూడా చేశారు. ఇక ప్రపంచ కప్ లో చోటు ఒకటి అర ఛాన్స్ దక్కించుకున్న  దీపక్ హుడా కూడా ఇటీవల జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో అదరగొట్టేసాడు. అయితే ఇక ఇప్పటివరకు జట్టులో చోటు దక్కించుకోని ఆటకాళ్లు సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే. అయితే ఇక చివరి టీ
20 మ్యాచ్ లో అయినా వీరిద్దరికి అవకాశం వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరికీ అవకాశం ఇవ్వలేదు అంటే ఇక వీరిని న్యూజిలాండ్ పిలిపించి కూడా ప్రయోజనం లేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.


 ఇదిలా ఉంటే రెండవ టి20 మ్యాచ్ లో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడవ టి20 మ్యాచ్ లో ఎలాంటి మార్పులు ఉంటాయి అన్న విషయం మాత్రం నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కానీ కేవలం ఇంకో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది మాత్రం కష్టతరంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: