పాకిస్తాన్ ను అందరూ కూడా ఉగ్రవాద దేశంగా పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అక్కడ సాధారణ జనాల లాగానే ఉగ్రవాదులు కూడా చేతిలో ఆయుధాలు పట్టుకొని ఎంతో ఎదేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. అంతేకాదు ఇక పాకిస్తాన్ నుంచి ఇతర దేశాల్లోకి రహస్యంగా చొరబడి ఉగ్రవాదులు ఎన్నో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఇక పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు కూడా ఎప్పుడు గుర్రు గానే ఉంటాయి. అయితే ఇక క్రికెట్ విషయంలో కూడా మొన్నటి వరకు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పై నిషేధం కొనసాగించాయి అన్న విషయం తెలిసిందే.


 ఒకప్పుడు అన్ని దేశాల లాగానే ఇక పాకిస్తాన్ కు కూడా విదేశీ జట్లు పర్యటనకు వెళ్లేవి. అయితే 2009లో ఇలా శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఏకంగా ఉగ్రవాదులు దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనగా మారిపోయింది. దీంతో ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రికెట్ బోర్డులు కూడా పాకిస్తాన్ పర్యటనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దశాబ్దాలు గడిచిపోయిన ఇక ఈ నిషేధంపై కఠినంగానే ఉన్నాయి అని చెప్పాలి. కానీ ఇప్పుడిప్పుడే ఇక విదేశీ జట్లు పాకిస్తాన్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇక ఆ దేశ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.


 ఇలాంటి సమయంలోనే ఇటీవలే మరోసారి పాకిస్తాన్లో జరిగిన ఘటన కాస్త క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పాకిస్తాన్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్ట్ లో గెలిచి రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. కాగా ఇటీవల ఇంగ్లాండ్ జట్టు ఉంటున్న హోటల్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. స్థానిక ముఠాల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఇక రెట్టింపు భద్రత మధ్య ఇంగ్లాండ్ జట్టు అటు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: