ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ అటు ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరు చివరి దశకు చేరుకుంది అని చెప్పాలి. ఇటీవల జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో క్రొయేషియా అర్జెంటీనా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మూడు 3-0 అర్జెంటీనా  విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే రెండవ ఫైనలిస్టు ఎవరు అన్న విషయం తేలాలి అంటే మాత్రం ఇక నేడు రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.


 ఈ క్రమంలోనే ఇకఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక రెండవ సెమీఫైనల్ లో భాగంగా ఛాంపియన్ ఫ్యాన్స్, ఆఫ్రికన్ సెన్సేషన్ అయినా మొరాకో తలబడబోతున్నాయి. ఈ క్రమంలోనే బ్రెజిల్ దిగ్గజా ఫుడ్ బాలర్ రోనాల్డో తన మనసులో మాటను బయటపెట్టాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిరుస్తారని విషయం పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.


 అర్జెంటినా టైటిల్ గెలిచే ఛాన్స్ లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రోనాల్డో. ఒకవేళ అర్జెంటీనా  గెలిచిన కూడా కపట వ్యక్తి లాగా ఉంటూ సంతోషిస్తాను అంటూ చెప్పను. అయితే నేను ఫుడ్ బాల్ నూ రొమాంటిక్ యాంగిల్ లో చూస్తాను. ఛాంపియన్గా ఎవరు నిలిచినా సంతోషమే. కానీ నా ఫేవరెట్ లిస్టులో మాత్రం బ్రెజిల్, ఫ్రాన్స్ మాత్రమే ఉన్నాయి అంటూ రోనాల్డో చెప్పుకొచ్చాడు. ఇకపోతే మరోసారి ఫుట్ బాల్ ఆటలో దిగ్గజ ప్లేయర్గా కొనసాగుతున్న మెస్సి ఈసారైనా తన వరల్డ్ కప్ కలను నెరవేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: