ఇటీవల బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఎన్నో రోజుల నుంచి పేలవమైన ఫామ్ కారణంగా జట్టుకు దూరమైన చతేశ్వర పూజార మళ్ళీ జట్టులోకి రీ ఎంట్రీ  ఇచ్చేసాడు. ఈ క్రమంలోనే ఇలా జట్టులోకి వచ్చిన మొదటి మ్యాచ్ లోనే 90 పరుగులు చేసి ఇక జట్టును కష్టాల్లో ఆదుకున్నాడు అని చెప్పాలి. ఒకవైపు భారత బ్యాట్స్మెన్లందరూ కూడా వికెట్లు కోల్పోయి వరసగా పెవిలియన్ చేరుతున్న సమయంలో పూజార మాత్రం ఎంతో నిలకడగా ఆడుతూ మరోసారి తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు అని చెప్పాలి.


 ఇలా ఎక్కడ ఒత్తిడికి లోనవ్వకుండా.. నిలకడగా ఆడుతూ 90 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇక చటేశ్వర్ పూజారా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ సెంచరీ చేయడం ఖాయమని అనుకున్నారు.  కానీ 90 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. అయినప్పటికీ ఇక చటేశ్వర్ పూజారా ఇన్నింగ్స్ అటు భారత జట్టుకు మంచి స్కోర్ అందించడంలో ఎంతగానో ఉపయోగపడింది.  ఇకపోతే ఇటీవల 90 పరుగులతో మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనపరిచిన   పూజార ఒక అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత దిగ్గజ బ్యాట్స్మెన్ అయినా దిలీప్ సర్కార్ రికార్డును అధిగమించాడు.



 ఇక టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిలీప్ వెంగ్ సర్కార్ ను వెనక్కి నెట్టి 8వ స్థానానికి ఎగబాకాడు  టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజార. దిలీప్ వెంగ్ సర్కార్ 116 టెస్ట్ మ్యాచ్ లలో 6868 పరుగులు చేయగా పూజార 97 టెస్ట్ మ్యాచ్ లోనే 6882 పరుపులు చేశాడు. ఈ క్రమంలోనే వెంగ్ సర్కార్ రికార్డును బ్రేక్ చేశాడు.  ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రాహుల్ ద్రవిడ్ 13265 పరుగులు, సునీల్ గవాస్కర్ 10122 పరుగులు, వివిఎస్ లక్ష్మణ్ 8781 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 8,503 పరుగులు, విరాట్ కోహ్లీ 8075 పరుగులు,సౌరబ్ గంగూలీ 7212 పరుగులు తో పూజార కంటే ముందున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: