గత కొంతకాలం క్రితం ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన చటేశ్వర్ పూజార   అటు కౌంటి క్రికెట్లో ఆడి మళ్లీ తన మునుపటి ఫామ్ను అందుకొని సెలెక్టర్ల చూపును ఆకర్షించి ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెలెక్టరు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొడుతూ ఉన్నాడు. ఇక ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్లో భాగంగా 90 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ లో భారీ హాఫ్ సెంచరీ నమోదు చేసిన చటేశ్వర్ పూజార ఇక రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి.


 ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే బ్యాటింగ్ తీరును కొనసాగిస్తూ అదరగొడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక మళ్ళీ మునుపటి ఫామ్ తో అభిమానులను సంతోషంలో ముంచేసిన చట్టేశ్వర్ పూజార ఇటీవలే  ఒక అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు పూజార. ఇక భారత జట్టు తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదవ బ్యాట్స్మెన్ గా రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ ఘనత ద్వారా సునీల్గా గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. రెండో టెస్ట్ మ్యాచ్లో భాగంగా షాకీబ్ ఆల్ హసన్ వేసిన 18.5 ఓవర్ కి మూడు పరుగులు తీసిన పూజార ఇలా 7000 పరుగులు మార్కు అందుకున్నాడు.


 అయితే రెండవ మ్యాచ్లో మాత్రం మొదటి ఇన్నింగ్స్ లో 24 పరుగులకే  వికెట్ కోల్పోయి కాస్త నిరాశపరిచాడు  పూజార. ఇకపోతే ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడని చెప్పాలి.  సచిన్ టెస్టులలో ఇప్పటివరకు 15921 పరుగులు చేయగా.. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ 13265 పరుగులతో ఉన్నాడు. ఇక సునీల్గా భాస్కర్ 10122 పరుగులు, వివిఎస్ లక్ష్మణ్  8781 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 8503 పరుగులు, విరాట్ కోహ్లీ 8099 పరుగులు, సౌరబ్ గంగూలీ 7212 పరుగులు, చటేశ్వర పూజార 7000 పరుగులతో ఈ లిస్టులో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: