
ఇక్కడ మహమ్మద్ సిరాజుకు ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అటు హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే.. తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్ విస్తార విమానంలో డాకా నుంచి ముంబై చేరుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మహమ్మద్ సిరాజ్ కు సంబంధించిన మూడు బ్యాగు లలో కేవలం రెండు మాత్రమే తిరిగి పొందాడు. మిగతా ఒక బ్యాగ్ మిస్ కావడం గమనార్హం.
ఇక ఈ విషయం ఏర్పోర్ట్ సిబ్బంది దృష్టికి వెళ్లగా వెంటనే తెచ్చి పెడతామని ఎయిర్పోర్ట్ సిబ్బంది సమాధానం చెప్పారు.. కానీ ఎంత ఎదురు చూసిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇక తన బ్యాగ్ మిస్ అయిందని అందులో ఎంతో విలువైన వస్తువులు ఉన్నాయి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు మహమ్మద్ సిరాజ్. ఈ క్రమంలోనే సదరు ఎయిర్ లైన్స్ సంస్థకు సిరాజ్ ఫిర్యాదు చేశాడు అని చెప్పాలి. యూకే మీదుగా ఢిల్లీకి ప్రయాణించానని..నేను మూడు బ్యాగులతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో ఒకటి మిస్ అయింది. కొద్దిసేపట్లో బ్యాగ్ కనుక్కుని డెలివరీ చేస్తామని ఎయిర్లైన్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బ్యాగ్ లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. వీలైనంత త్వరగా బ్యాగ్ ను హైదరాబాద్ చేరవేయగలరు అంటూ సోషల్ మీడియా వేదికగా కోరాడు మహమ్మద్ సిరాజ్.