మొన్నటి వరకు పేలవమైన ఫామ్ లో ఉన్నాడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవల సెంచరీ డబుల్ సెంచరీలతో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక అటు ఆస్ట్రేలియా జట్టు మరోసారి సొంత గడ్డపై సత్తా చాటింది. ప్రత్యర్థి  దక్షిణాఫ్రికాను వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. ఇటీవల రెండో టెస్టులో ఒక ఇన్నింగ్స్ తో పాటు 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా.


 అయితే గత కొంతకాలం నుంచి ఫామ్ లేమితో వార్నర్ ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల తనపై వచ్చిన విమర్శలు అన్నింటికీ కూడా బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ లో ఆడటం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ లో ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.


 అందుకు నన్ను నేను ఫిట్గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను. ఇక పరుగులు కూడా చేస్తూనే ఉంటాను. వరల్డ్ కప్ లాంటి పెద్ద వేదికలపై మంచి ప్రదర్శన చేయాలని శక్తి నాలో ఎప్పుడూ ఉంటుంది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. అయితే నేను ఆడాలా వద్దా అన్నది మాత్రం టీం మేనేజ్మెంట్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అంటూ తెలిపాడు. ఒకవేళ జట్టు యాజమాన్యం నన్ను నిష్క్రమించమని కోరితే అందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వార్నర్ స్పష్టం చేశాడు. గత కొంతకాలం నుంచి డేవిడ్ వార్నర్ కు క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో   డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: