టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవలే ఎవరు ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో భాగంగా రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం రిషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రిషబ్ పంత్. అయితే అతనికి చీలిమండ, మెడ, తలకు కూడా తీవ్ర గాయమైన నేపథ్యంలో అతను కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.


 స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన టెస్ట్ సిరీస్ కి కూడా రిషబ్ పంత్ ఇక భారత జట్టుకు అందుబాటులో లేడు అన్న విషయం ఇటీవల క్లారిటీ వచ్చింది. అయితే అటు రిషబ్ పంత్ ఐపిఎల్ సమయానికి కూడా కోలుకుంటాడు అన్న క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఒకవేళ రిషబ్ పంత్ ఐపీఎల్ కి కూడా అందుబాటులో ఉండకపోతే అతను సారధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్గా వ్యవహరించబోయేది ఎవరు అన్నది ప్రస్తుతం చర్చకు వచ్చింది.


 అయితే ఒకవేళ 2023 ఐపీఎల్ సీజన్ సమయానికి పంత్ కోలుకోక పోతే  ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న అందరి ఆటగాళ్ల లో చూసుకుంటే వార్నర్ అంత అనుభవం ఎవరికీ లేదు అని చెప్పాలి.  ఇక ఐపీఎల్ లో సన్రైజర్స్ కు  5 ఏళ్ళ పాటు కెప్టెన్సీ వహించిన అనుభవం కూడా అటు వార్నర్ కి ఉంది. అందుకే ఒకవేళ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం వార్నర్ వైఫై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: