
ఇలా వైవిద్యమైన బౌలింగ్ ప్రతిభను పరదర్శించలేకపోతున్న ఉమ్రాన్ మాలిక్ ఇక అటు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు. మొదటి మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకుని అదరగొట్టాడు. అయితే ఇలా వికెట్లు అయితే తీసుకున్నాడు కానీ మరోవైపు నుంచి మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం టీమిండియా కు మైనస్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా రెండు టీ20 మ్యాచ్ లో అటు మిగతా బౌలర్లు విఫలమైన వేల అటు ఉమ్రాన్ మాలిక్ మాత్రం మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.
అయితే ఉమ్రాన్ మాలిక్ వికెట్లు తీసినప్పటికీ పరుగులు భారీగా సమర్పించుకున్న నేపథంలో పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ బట్ ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఉమ్రాన్ దగ్గర అనుభవం లేదని దీంతో అతను కొత్త వేరియన్స్ కోసం ప్రయత్నించాలని.. సల్మాన్ బట్ సూచించాడు. అతని బౌలింగ్ మరీ సింపుల్ గా ఉంది. అతను ఎలాంటి బంతి వేస్తాడని బ్యాట్స్మెన్ లు ముందే ఊహించేలా.. అతని బౌలింగ్ సాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అద్భుతమైన ఫేస్ బౌలింగ్ సందిస్తున్న ఉమ్రాన్ మాలిక్.. మరిన్ని వైవిద్యమైన బంతులను సందిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఒక్క యార్కర్ కూడా పడకపోవడం ఆశ్చర్యపరిచింది అంటూ సల్మన్ బట్ చెప్పుకొచ్చాడు.