గత కొంతకాలం నుంచి అన్ని ఫార్మాట్ లలో కూడా సెంచరీలు చేస్తూ చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ ఇక ఇటీవలే మరోసారి తన విధ్వంసానికి కొనసాగించాడు అన్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 113 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ.  ఈ క్రమంలోనే తన కెరీర్ లో వన్డే ఫార్మాట్ లో 45వ  సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక స్వదేశంలో విరాట్ కోహ్లీకి ఇది 20వ సెంచరీ కావడం గమనార్హం.


 ఇలా తన అద్భుతమైన సెంచరీ తో విరాట్ కోహ్లీ ఇక  ఇండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర వహించాడు. తద్వారా ఇక వన్డే మ్యాచ్లో టీమిండియా జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల సెంచరీ సాధించడం ద్వారా క్రికెట్ దిగ్గజం అయిన  సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన పలు రికార్డులను కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. దీంతో ఇక ఎంతోమంది విరాట్ కోహ్లీని లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పోలిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చెప్పాలి. ఇదే విషయంపై మాజీ ఓపెనర్ గౌతమ్ పేరు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదు అంటూ అభిప్రాయపడ్డాడు గౌతమ్ గంభీర్. సచిన్ కాలంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాట్స్మెన్ లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం ఎంతో కష్టం అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. 30 యార్డ్స్ సర్కిల్ వెలుపల 5 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు ఉండేవారు. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టం. అందుకే సచిన్ గ్రేట్. విరాట్ కోహ్లీని  సచిన్ తో పోల్చడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఎవరో ఒకరిపై నోరు పారేసుకోవడం తప్ప వేరే పని ఉండదు అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: