
ఇకపోతే టీమ్ ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని అంటే అటు గౌతమ్ గంభీర్ కు అస్సలు నచ్చదు. ఇక అతనిపై అతని కెప్టెన్సీ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు. ధోని పేరు వినిపించింది అంటే చాలు గంభీర్ బ్లడ్ బాయిల్ అవుతుందేమో అన్న విధంగానే మాట్లాడుతూ ఉంటాడు. వరల్డ్ కప్ కేవలం ధోని కెప్టెన్సీ వల్ల రాలేదని అందరూ కలిసికట్టుగా ఆడటం వల్లే వచ్చిందంటూ గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు అన్న విషయం తెలిసిందే. అందుకే గంభీర్ ధోని గురించి ఎప్పుడైనా పాజిటివ్‌గా మాట్లాడాడు అంటే చాలు అది కాస్త అందని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు ధోని గురించి ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు గౌతమ్ గంభీర్. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన రోజులను గుర్తు చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ ప్రపంచకప్ ఫైనల్ సమయంలో మహేంద్ర సింగ్ ధోని, గౌతమ్ గంభీర్ కూడా మంచి భాగస్వామ్యాన్ని నిర్మించి ఇక విజయాన్ని అందించారు. అయితే ఆ సమయంలో ధోని తనకు చాలా సపోర్ట్ చేశాడు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. నేను సెంచరీ కొట్టాలని ధోని కోరుకున్నాడు. ఇక ఎప్పుడు నేను సెంచరీ స్కోర్స్ చేయాలని కోరుకునేవాడు. ఓవర్ల మధ్యలో తను టైమ్ తీసుకోమని సూచించాడు. తొందర పడవద్దు అని సలహా ఇచ్చేవాడు. అవసరమైతే ధోనినే వేగంగా స్కోర్ చేయడం ప్రారంభిస్తాను అంటూ చెప్పేవాడు అంటూ గౌతమ్ గంభీర్ ధోని గురించి పాజిటివ్ కామెంట్స్ చేశాడు. కాగా శ్రీలంక, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని 79 బంతుల్లో 91 పరుగులు చేయగా మరోవైపు గౌతమ్ గంభీర్ 97 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.