టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అనే విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కి ప్రాంతంలో అతని కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఇక ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ గాయాలతో బయటపడ్డాడు అని చెప్పాలి. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీలు కూడా కావడం గమనార్హం. ఇక రిషబ్ పంత్ వేగంగా కోరుకుంటున్నాడని అటు బీసీసీఐ వర్గాలు చెబుతూ ఉన్నాయి.


 అయితే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఇంత దారుణమైన ప్రమాదం నుంచి అతను ప్రాణాలతో ఎలా బయటపడగలిగాడు అన్న అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదంలో అతని బిఎండబ్ల్యూ కారు అక్కడికక్కడే కాలి బూడిదయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడటానికి ఇద్దరు వ్యక్తులు కారణం అన్న విషయం తెలిసిందే. సరైన సమయంలో ఇక ఇద్దరు వ్యక్తులు అతన్ని ఆసుపత్రికి తరలించడంతో ఇక విషపుంత ప్రాణాలకు ఎలాంటి అపాయం రాలేదు.


 ఇకపోతే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ మొదటి సారి ఒక విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న తనను కాపాడిన రజాత్ కుమార్, నిషు కుమార్ ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.  తన కోసం ప్రార్థించిన వారందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పకపోవచ్చు. కానీ నేను ఇద్దరి హీరోలను మాత్రం గుర్తించాలి. నేను సురక్షితంగా ఆస్పత్రికి చేరుకునేలా చేసిన వీళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. అతను తొందరగా కోలుకొని మళ్ళీ భారత జట్టులోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: