2022 సంవత్సరంలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్లలో విజయం సాధించి సత్తా చాటిన టీమిండియా జట్టు 2023 ఏడాదిలో కూడా అదే జోరును కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో సరికొత్త జోష్ తో ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లను కూడా కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోని టీమ్ ఇండియా జట్టు.. ఇక వన్డే సిరీస్ మాత్రం 3-0 తేడాతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 ఇక టీమిండియాలో ఉన్న ప్రతి ఆటగాడు కూడా మంచి ఫామ్ లో కొనసాగుతూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉండడంతో ఇక జట్టుకు తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే కొత్త ఏడాదిలో శుభారంభం చేసిన టీమ్ ఇండియా  ఇక ఇప్పుడు మరోసారి అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి వన్డే సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి. ఇక ఈ వన్డే సిరీస్ ని కూడా కైవసం చేసుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేసుకుంది రోహిత్ శర్మ సారధ్యంలో బరిలోకి దిగే టీమ్ ఇండియా జట్టు.


 న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ అటు హైదరాబాదులోని స్టేడియంలో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ లో మునిగి తేలారు. ఇక ప్రస్తుతం ప్రపంచ కప్ సమీపిస్తున్న సమయంలో ఈ సిరీస్ టీమ్ ఇండియాకు ఎంతో కీలకంగా మారింది. కాగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఇక న్యూజిలాండ్తో సిరీస్ కి దూరం అయ్యాడు. ఇక అతను స్థానంలో రజాత్ పటిదార్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో అక్షర్ స్థానంలో చాహల్ లేదా కుల్దీప్ జట్టులోకి వస్తారని తెలుస్తుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: